హైదరాబాద్, బెంగుళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గండిగూడా వద్ద డీసీఎం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పరువు హత్య.. అల్లుణ్ని చంపించిన మామ