ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

వికారాబాద్​ జిల్లా దాచారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని జీపు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident at Dyacharam in vikarabad district one dead
రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Sep 27, 2020, 8:04 PM IST

Updated : Sep 27, 2020, 9:19 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాలపల్లికి చెందిన నందు(30) ధారూరు మండలం మోమిన్​కలాన్​లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బంధువులు వెంకటేశ్​, ప్రభాకర్​లతో కలిసి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. దాచారం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తోన్న జీపు వీరి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో నందు అక్కడికక్కడే మృతి చెందగా.. వెంకటేశ్​, ప్రభాకర్​లకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో వికారాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు వెంకటేశ్​ మిట్టకోడూరు, ప్రభాకర్​ తుంకిమెట్లుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం

Last Updated : Sep 27, 2020, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.