భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ రోడ్డులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును స్కూటీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు.. భద్రాచలం భగవాన్ దాస్ కాలనీకి చెందిన పి.వెంకట రమణగా పోలీసులు గుర్తించారు. సారపాకలోని తాళ్ల గుమ్మూరు సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా వెంకటరమణ పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ప్రమాదంలో తల్లిబిడ్డ..