ETV Bharat / jagte-raho

అనిశాకు పట్టుబడిన ఆర్​ఐ, ఎస్సైకి రిమాండ్​

ఓ భూవివాదం కేసులో లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడిన ఆర్​ఐ, ఎస్సైని అధికారులు ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad latest News
అనిశాకు పట్టుబడిన ఆర్​ఐ, ఎస్సైకి రిమాండ్​
author img

By

Published : Jun 7, 2020, 11:01 PM IST

బంజారాహిల్స్ భూవివాదం కేసులో రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ ఎస్‌ఐ రవీంద్ర నాయక్‌ను అనిశా అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌పేట తహసీల్దార్ సుజాతను రెండో రోజు 9 గంటలపాటు విచారించిన అధికారులు సోమవారం కూడా ఆమెను విచారించే అవకాశం ఉంది.

తహసీల్దార్​ ఇంట్లో దొరికిన డబ్బు, నగలకు సంబంధించిన ఆధారాలపై కూలంకషంగా సుజాతను ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆర్‌ఐ నాగార్జున రెడ్డి... భూమిపై ఉన్న వివాదానికి సంబంధించి ఆయన బ్యాంకు ఖాతా వివరాలు శనివారం పట్టుబడిన సొమ్ముకు సంబంధించి 10గంటలపాటు విచారణ జరిపారు. కేవలం అతనే ఈ డబ్బును తీసుకున్నాడా లేక తహసీల్దార్ ఆదేశాల మేరకే ఖాలిద్‌ అనే వ్యక్తి నుంచి 15లక్షల రూపాయలు తీసుకున్నాడా అనే దానిపై అధికారులు సూటిగా ప్రశ్నించారు.

అనంతరం అతన్ని వ్యక్తిగత వాహనంలో ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు అసలు భూమిని సర్వే చేసేందుకు ఎలాంటి ప్రక్రియను చేపట్టాలి... దాని విధి విధానాలపై సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని నాంపల్లి అనిశా కార్యాలయంలో విచారించారు. ఈ వివాదం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.