నల్గొండ జిల్లా మిర్యాగూడలో పోలీసులు దాడులు నిర్వహించి రేషన్ బియ్యం లారీలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులు అనుమానం రాకుండా రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి కోళ్ల దానకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వీరికి సహకరిస్తున్న మిల్లులపై కూడా పోలీసులు దాడులు చేసి పిండి మరలను సీజ్ చేశారు.
మే 5న ఆలగడప వద్ద సన్నిధి రమణకుమార్కు చెందిన 210 క్వింటాళ్ల రేషన్ బియ్యం నూకలుగా మార్చి లారీలో ఏపీకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మే 27న అదే వ్యక్తికి చెందిన ముప్పై ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జూన్ 8న రెండు లారీలు, ఒక మ్యాక్సీ క్యాబ్లో 50 కిలోల రేషన్ బియ్యాన్ని వాడపల్లి వద్ద ఆంధ్రాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. మార్చ్ 13న పోతుగంటి శ్రీను అనే వ్యాపారి మిర్యాలగూడలో తన సొంత వాహనాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి అక్రమ వ్యాపారం చేస్తున్న సన్నిధి రమణకుమార్పై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ కేంద్ర కారాగారం తరలించారు.
ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ