భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో గడిచిన 18 నెలల్లో దాదాపు 1,100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమార్కుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ కాలం నుంచి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ బియ్యాన్ని వినియోగించని కార్డుదారులు అమ్మకాలు చేస్తుండడం వల్ల అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
మండలంలో ఇప్పటికే 36 వరకు కేసులు నమోదు చేశామని డిప్యూటీ తహసీల్దార్ ముత్తయ్య చెప్పారు. బియ్యం అవసరం లేని కార్డుదారులు తీసుకోవద్దని సూచించారు. బియ్యం అమ్ముతున్న వారి కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: దేవాలయానికి వెళ్లి నీటిలో చిక్కుకున్న వ్యక్తి