ఖమ్మం నుంచి రాజమండ్రికి అక్రమంగా తరలిస్తున్న చౌకబియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్నపోలీసులు జిల్లాలోని తల్లాడ వద్ద తనిఖీలు నిర్వహించారు.
రెండు లారీలను సీజ్ చేసి, 41 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు.