మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా బొల్లారానికి చెందిన రాజేశ్ అల్వాల్‌కు చెందిన ఓ మైనర్ బాలికను సోమవారం కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికను తుర్కపల్లి తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌పై అత్యాచారం చేసి, హత్య చేశాడు.
ఈ క్రమంలో బాలిక కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుర్కపల్లి రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.5000 జరిమానా విధించింది.
ఇదీచూడండి.. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్