ETV Bharat / jagte-raho

చాక్లెట్​ ఇస్తానని ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం - బాలికపై హత్యాచారయత్నం

వరంగల్​ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణం జరిగింది. పాల ప్యాకెట్​ కోసం దుకాణానికి వెళ్లిన ఐదేళ్ల బాలికపై 36 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. చాక్లెట్​ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించగా... బాలిక ఏడవసాగింది. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితునికి దేహశుద్ధి చేశారు.

rape attempt on girl in warangal urban district
చాక్లెట్​ ఇస్తానని ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
author img

By

Published : Oct 27, 2020, 9:30 AM IST

ముక్కుపచ్చలారని 5 ఏళ్ల బాలికపై 36 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం పాలప్యాకెట్ కోసం బాలిక సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అదే కాలనీకి చెందిన కిట్టు అనే వ్యక్తి చాక్లెట్ ఇస్తానని నమ్మబలికి ఎవరూ లేని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తలుపులు మూసి అసభ్యంగా ప్రవర్తించగా భయబ్రాంతులకు గురైన బాలిక గట్టిగా ఏడవసాగింది. బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని నిందితునికి దేహశుద్ధి చేశారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యానికి బానిసై గ్రామంలో జులాయిగా తిరుగుతుంటాడని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: భర్త హత్య.. భార్యే చంపిందిందా.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.