ETV Bharat / jagte-raho

అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్​ - సంగారెడ్డి జిల్లాలో మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులు

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు తండాలో మహిళపై జరిగిన అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల నుంచి ఒక కారు, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

rape and murder case accused arrested in hyderabad
అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్​
author img

By

Published : Nov 6, 2020, 6:02 PM IST

మహిళను కారులో బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన ఘటనలో పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేసి రిమాండ్​ పంపినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు తండాకు చెందిన ప్రేమలత అనే వివాహిత తన తల్లి గారి ఇల్లైన మియాపూర్​లోని న్యూ కాలనీకి వచ్చింది.

ఈనెల 3న ఆమెకు పరిచయమున్న కొల్లూరు తండాకు చెందిన మధు నాయక్ ఫోన్ చేసి మియాపూర్ చౌరస్తాకు రావాలని కోరాడు. అతని కోరిక మేరకు ఆమె మియాపూర్ చౌరస్తాకు వచ్చింది. అమీర్​పేట్ నుంచి మియాపూర్​ చౌరస్తాకు కారులో వచ్చిన మధు నాయక్, సింగం ఆనంద్ అలియాస్​ తను యాదవ్, తాలూరి కుటుంబ రెడ్డి ప్రేమలతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

కొల్లూరు గ్రామం సమీపంలోని రేకుల షెడ్డులో ఆమెను ముగ్గురు బలవంతం చేసి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ప్రేమలత తలకు బలంగా గాయం తగలడం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితులు మృతదేహాన్ని అక్కడే ఉంచి.. వచ్చిన కారులోనే వెళ్లిపోయారు. ప్రేమలత ఇంటికి రాకపోవటంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇంతలో కొల్లూరు సమీపంలో మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారమొచ్చింది. ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేయగా.. ప్రేమలత మృతదేహంగా గుర్తించారు. కాల్​ డేటా, సీసీ కెమెరా ఫుటెజ్​ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రేమలత భర్త కొంతకాలం క్రితం మృతి చెందాడు. ఆమెకి ఇద్దరు పిల్లలున్నారు.

ఇదీ చదవండి: గంగుల శ్రీనివాస్​ అంతిమయాత్రలో బండిసంజయ్​, ఆర్వింద్​, డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.