ETV Bharat / jagte-raho

‍‌నేపాలీ ముఠాలో ఐదుగురిని పట్టుకున్నాం: సీపీ మహేశ్​ భగవత్​

author img

By

Published : Oct 26, 2020, 3:32 PM IST

Updated : Oct 26, 2020, 6:30 PM IST

ఈ నెల 19న నాచారం పీఎస్‌ పరిధిలో జరిగిన నేపాలీ చోరీ కేసులో ఐదుగురిని పట్టుకున్నామని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఇంట్లో పనిమనుషులుగా చేరిన ముఠా వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి దోపిడీ చేశారని పేర్కొన్నారు. మొత్తంగా 25 ప్రత్యేక బృందాలతో గాలించి.. నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ చోరీ కేసుతో మొత్తం 8 మందికి ప్రమేయం ఉందన్నారు. నిందితుల నుంచి ఏడు లక్షల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్పష్టం చేశారు.

‍‌నేపాలీ ముఠాలో ఐదుగురిని పట్టుకున్నాం: సీపీ మహేశ్​ భగవత్​
‍‌నేపాలీ ముఠాలో ఐదుగురిని పట్టుకున్నాం: సీపీ మహేశ్​ భగవత్​

మేడ్చల్ జిల్లా నాచారం పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్యాయత్నం, దోపిడీ కేసును రాచకొండ పోలీసులు చేధించారు. ఐదుగురు నేపాలీ సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ఏడు లక్షల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు.

ఇంట్లో పనిమనుషులుగా చేరి..

నాచారం హెచ్‌ఎంటీ కాలనీలో నివాసముంటున్న చింతపులుసు ప్రదీప్‌ కుమార్​ అనే వ్యక్తి ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాల్‌ దంపతులు అర్జున్, మాయ చోరికి పాల్పడ్డారు. ఈనెల 19న కుటుంబ సభ్యులు విధుల నిమిత్తం బయటకు వెళ్లగా అదను చూసి నేపాల్‌ దంపతులు ఇంట్లో ఉన్న వృద్ధురాలి నోట్లో మత్తుమందు గుడ్డను కుక్కి స్పృహా కోల్పోయేలా చేశారు. అనంతరం 18 తులాల బంగారం, 40 తులాల వెండి దోచుకెళ్లారు.

25 ప్రత్యేక బృందాలతో..

విషయం తెలుసుకున్న ఇంటి యాజమాని ప్రదీప్‌ కుమార్‌ అదే రోజు రాత్రి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేపాలీల దోపిడీ కేసును సవాల్‌గా తీసుకున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

లక్నోలో అరెస్ట్​..

సీసీఎస్‌, ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, ఇద్దరు అదనపు డీసీపీలు, ఎస్వోటీ మల్కాజిగిరి ఇన్​స్పెక్టర్​ నవీన్‌, ఐటీ సెల్‌ శ్రీధర్‌ రెడ్డి, శాంతిభద్రతల ఇన్‌స్పెక్టర్​, డీఐలు భాగస్వామ్యమై దర్యాప్తు చేపట్టారని మహేశ్​ భగవత్​ తెలిపారు. పూణె, ముంబయి, లక్నో, నేపాల్‌ సరిహద్దుల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయని, స్థానిక పోలీసుల సహకారంతో మాయను లక్నోలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రూ. 1.49 లక్షలు నగదు, ఒక లాకెట్‌, ఒక ముత్యాలహారం, కమ్మలు, ఫాస్ట్‌ ట్రాక్‌ వాచ్‌లు, ఒక ఐఫోన్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆ నేపాలీల కోసం 8 బృందాలతో గాలింపు

Last Updated : Oct 26, 2020, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.