ETV Bharat / jagte-raho

అర్ధరాత్రి సైకో వీరంగం.. మహిళలనే టార్గెట్ చేస్తూ దాడికియత్నం - కోదాడలో సైకో హల్​చల్​

అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అంతలోనే ఏదో పెద్ద శబ్దం. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అరుపులు.. కేకలు! ఓ వ్యక్తి విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నాడు. మహిళలనే టార్గెట్ చేస్తూ.. దాడికి యత్నిస్తున్నాడు. అందరూ గుమిగూడేసరికే పరారయ్యాడు. శుక్రవారం... కోదాడలోని శ్రీనివాస్ నగర్ కాలనీ నిద్రలేని రాత్రి గడిపింది.

psycho-frightened-women-in-srinivasa-nagar-colony-kodada
అర్ధరాత్రి సైకో వీరంగం.. మహిళలనే టార్గెట్ చేస్తూ దాడికియత్నం
author img

By

Published : Jan 16, 2021, 12:34 PM IST

అర్ధరాత్రి సైకో వీరంగం..

సంక్రాంతి వేడుకలు ముగిశాయి. రోజుకంటే పడుకోవడానికి ఇంకాస్త ఆసల్యమైంది. అప్పుడే నిద్రలోకి జారుకుంటుండగా... ఒక్కసారిగా ఎవరో వచ్చిన అలికిడి. లేచి చూసేసరికే... ఓ వ్యక్తి మీదపడి రక్కేయత్నం చేస్తున్నాడు. కేకలు వేయడంతో అందరూ గుమిగూడారు. ఆ వ్యక్తి మాత్రం మహిళలనే టార్గెట్ చేస్తూ దాడికి యత్నిస్తున్నాడు. నిత్యం ప్రశాంతంగా ఉండే కోదాడలోని శ్రీనివాస నగర్​లో శుక్రవారం అర్ధరాత్రి పరిస్థితి ఇదీ!

అర్ధరాత్రి వేళ అందరూ నిద్రిస్తుండగా ఓ సైకో కాలనీలోకి ప్రవేశించాడు. ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో.. మిగతా వాళ్లు వచ్చారు. అతను మాత్రం ఆగలేదు. అదే రీతిలో దాడికి యత్నిస్తూనే ఉన్నాడు. ఓ మహిళ మెడను పట్టుకుని లాగుతూ.. బలంగా రక్కే ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుంది. జనం ఇంకాస్త పెరగడంతో సైకో.. పరారయ్యాడు.

అసలక్కడ ఏం జరుగుతుందో... గ్రహించేలోపే ఇదంతా జరిగిపోయింది. ఇంతలోనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అసలక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఎవరు చూశారు? ఎవరెవరిపై దాడికి యత్నించాడు?.. ఇలాంటి సమాచారం అంతా సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లోనే తలుపులు వేసుకుని ఉన్నా కానీ.. ఏదో ఓ మూలను భయం వారిని వెంటాడింది. ఓ సైకో వీరంగం సృష్టించిన వీడియో సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.

ఇదీ చదవండి: పాత కక్షలతో యువకుడిపై బ్లేడుతో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.