సూర్యాపేట జిల్లా మహంకాళిగూడెంనకు చెందిన వేముల వెంకట్రావు అనే వ్యక్తిని డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి చెందిన లారీ రెండు రోజుల క్రితం ఢీకొట్టింది. ఘటనలో వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాధితుడిని హైదరాబాద్కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగి రెండు రోజులైనా డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం స్పందించకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుడికి పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
- భార్యాపిల్లలను చూసేందుకు వచ్చి..
వెంకట్రావు దాచేపల్లిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యా, పిల్లలు మహంకాళిగూడెంలో ఉంటున్నారు. ఈ క్రమంలో వారిని చూసి వెళ్లేందుకని రాగా.. ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.