వరంగల్ అర్బన్ జిల్లా మిల్స్ కాలనీ చింతల్ బస్తీలోని ఒక ఇంట్లో నిషేధిత గుట్కా బ్యాగులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 బ్యాగుల అంబర్, 1 బ్యాగు పవర్ గుట్కాలు లభ్యమయ్యాయి. వాటి విలువ రూ. 2 లక్షల 35 వేలు ఉంటుందని తెలిపారు.
చింతల్ బస్తీకీ చెందిన ఓ మహిళ ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మహిళ సోదరుడు భువనగిరి జిల్లాకి చెందిన సురేష్.. బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో ఇక్కడకు తీసుకువచ్చేవాడు. వీరిద్దరూ కలసి నగరంలోని దుకాణాల్లో విక్రయిస్తుండేవారు. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: బిహార్ బరి: వర్చువల్ ర్యాలీలతో నితీశ్ ప్రచార బాట