కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్లో ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీ కొట్టిన ఘటనలో... ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన బూడిద శ్రీనివాస్ గుండ్లపల్లి మీదుగా గన్నేరువరం వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మన్నెంపల్లికి చెందిన ఎల్లవ్వ అలియాస్ నీలిమ గన్నేరువరం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ కారణంగా... విధులకు హాజరయ్యేందుకు ఇబ్బంది అవుతోంది. ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె తమ్ముడు బూడిద శ్రీనివాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో శ్రీనివాస్ సాయంతో విధులకు హాజరవుతోంది. వినాయక చవితి రోజే తమ కుటుంబంలో క్షోభ మిగిల్చిందని... నీలిమ బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమైంది. ఇరుకు రోడ్డు, గుంతల్లో అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు అంటున్నారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ప్రైవేటు వైద్యుడు మృతి
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని... ప్రైవేటు వైద్యుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన బూడిద శ్రీనివాస్గా గుర్తించారు.