ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లె- పుంగనూరు రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బండకిందపల్లికి వెళ్తున్న ఓ ప్రైవేట్ మినీ బస్సు.. బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా... మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులు ముగ్గురు ఎర్రబల్లి, బండకిందపల్లికి చెందిన వారిగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతివేగంగా వస్తూ అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న బండరాయిని బస్సు ఢీకొట్టడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేవలం 15 సీట్లున్న ప్రైవేట్ మినీ బస్సులో... 30మందికి పైగా ప్రయాణం చేసినట్లు గుర్తించారు. స్థానికులు వెంటనే అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత