ETV Bharat / jagte-raho

81 కిలోల గంజాయి స్వాధీనం.. నిందితుల అరెస్ట్​

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 81 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Possession of 81 kg marijuana in rachakonda commissionarate
81 కిలోల గంజాయి స్వాధీనం.. వివరాలు వెల్లడించిన సీపీ
author img

By

Published : Jun 26, 2020, 2:22 PM IST

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురు నిందితులను ఎల్బీనగర్​ వద్ద అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు​, ఎస్​వోటీ సిబ్బంది సంయుక్తంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 81 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు.

హైదరాబాద్​ కేంద్రంగా 9 మంది నిందితులు ఏపీలోని విశాఖ నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. రాజస్థాన్​కు సరఫరా చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. నిందితుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ప్రధాన సూత్రదారి నునావత్​ జగన్​గా తెలిపారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు.. 2 కార్లు, 9 సెల్​ఫోన్లు, రూ.1.45 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. గంజాయి విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

ఇదీచూడండి: నేను మీలాగే పోలీసును.. నన్ను వదిలేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.