సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రెండేళ్ల బాలిక అపహరణ కథ సుఖాంతమైంది. నెల్లూరు వెళ్లేందుకు కుమార్తె, కుమారుడితో నిన్న అర్ధరాత్రి రైల్వేస్టేషన్‌కు వచ్చిన సురేశ్... ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని వక్తి వచ్చి చిన్నారిని అపహరించాడు. కిడ్నాప్ చేసిన వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలోనే పాపను వదిలి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. పాప సురక్షితంగా దొరకడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారిని అపహరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు