నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మత్తు పదార్ధాల సరఫరాపై రాచకొండ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు డిగ్రీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.8లక్షల విలువ చేసే 1.5లీటర్ల హాషిష్ ద్రావణం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులు అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఉదయ్ అనే వ్యక్తి నుంచి చింతల సందీప్, షిండే సాయి చరణ్, యాప్ర నవీన్‌లు మత్తు పదార్థాలను నగరానికి తీసుకొస్తుండగా దిల్సుఖ్నగర్ వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ద్రావణాన్ని రూ.3వేలకు 10మిల్లీలీటర్ల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి ఎస్వోటీ, సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
ఇదీ చదవండి: కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది..