ETV Bharat / jagte-raho

పీడీఎస్ బియ్యం పట్టివేత.. నలుగురి అరెస్ట్ - గూడూరులో పీడీఎస్ బియ్యం

మహబూబాబాద్ జిల్లా గూడూరులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 30క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Police seize 30 quintals of PDS rice smuggled in auto in Gudur area of Mahabubabad
గూడూరులో పీడీఎస్ బియ్యం పట్టివేత... నలుగురి అరెస్ట్
author img

By

Published : Jan 19, 2021, 8:59 AM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు పరిధిలో.. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 30క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేశారు.

గాజులగట్టు క్రాస్​రోడ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. ఆటో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేపట్టినట్లు గూడూరు ఎస్.ఐ సతీశ్ పేర్కొన్నారు. నిందితులు.. స్వామి, కరీం పాషా, రాంబాబు, ప్రభాకర్​లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పీడీఎస్​ బియ్యంతో పాటు గుట్కా, నల్ల బెల్లాన్ని అక్రమ రవాణా చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.