యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామ శివారులో గుట్టుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్వోటీ, యాదగిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఐదుగరిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.
పట్టుబడిన వారి నుంచి 52,080 రూపాయల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: వంతెనపై నుంచి పడిన సిమెంట్ లారీ.. ఇద్దరు మృతి