ETV Bharat / jagte-raho

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టు డంప్​ స్వాధీనం - ap news

ఆంధ్ర - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో గాలింపు చేపట్టిన బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసుల‌ు.. భారీ మావోయిస్టు డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని అర‌ప‌ద‌ర్ ‌- ఆండ్రాప‌ల్లి అట‌వీ ప్రాంతంలో ఈ డంప్‌ను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భారీ మావోయిస్టు డంప్​ స్వాధీనం

author img

By

Published : Nov 13, 2020, 3:00 AM IST

ఆంద్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లా క‌టాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని అర‌ప‌ద‌ర్‌ - ఆండ్రాప‌ల్లి అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను గుర్తించారు.

రెండు మందు పాత‌ర‌లు, 14 హ్యాండ్ గ్రైనేడ్‌లు, 13 ఎల‌క్ట్రిక్ డిటోనేట‌ర్లు, 9 ఎంఎం పిస్ట‌ల్​కు చెందిన 55 రౌండ్స్‌, 303 తుపాకీకి చెందిన 93 రౌండ్ల బుల్లెట్లు ఉన్న‌ట్లు ఒడిశా మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. ఎస్‌జ‌డ్‌సీ మావోయిస్టులకు చెందిన డంప్​గా గుర్తించామ‌ని వెల్లడించారు.

ఇదీ చదవండి: గుప్త నిధుల తవ్వకాలకు యత్నం...అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.