భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొజ్జాయిగూడెం సమీపంలోని అటవీప్రాంతంలో కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఘటనా స్థలంలో దాదాపు 19 మంది పందెం నిర్వహణలో ఉండగా కొందరు పరారయ్యారు.
కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.14,650 నగదు, మూడు చరవాణులు, ఏడు ద్విచక్రవాహనాలు, రెండు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బరపటి రమేశ్ వెల్లడించారు.