బోయిన్పల్లి అపహరణ కేసులో అఖిలప్రియను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో వివిధ అంశాలపై ఆరా తీసున్నారు. ఆమె తరఫు న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నిస్తున్నారు.
అపహరణ జరిగిన సమయంలో అఖిలప్రియ ఎక్కడున్నారు.. పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవరామ్ ఎక్కడున్నారు.. అపహరణకు పథకం ఎవరు రచించారు.. తదితర అంశాలపై విచారణ జరుపుతున్నారు.
ఈ కిడ్నాప్ కేసులో ఏ-3గా ఉన్న భార్గవరామ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతని ఆచూకీ లభమైతే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ఏ-1గా అఖిలప్రియ, ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవరామ్ ఉన్నారు.
ఇవీచూడండి: పోలీసుల కస్టడీలో అఖిలప్రియ.. బేగంపేట మహిళా ఠాణాకు తరలింపు