ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 7 మంది అరెస్ట్​ - yadadri district latest news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న 7 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.61,210 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 8 చరవాణులు, 5 సెట్ల పేకలను స్వాధీనం చేసుకున్నారు.

police officials raids on bingo spots in yadadri district
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 7 మంది అరెస్ట్​
author img

By

Published : Dec 11, 2020, 1:12 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పేకాట స్థావరంపై భువనగిరి ఎస్​వోటీ, ఆత్మకూర్ పోలీసులు గురువారం సాయంత్రం సంయుక్తంగా దాడి నిర్వహించారు. 7 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

మండల కేంద్రంలోని జేఏఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆత్మకూర్ మండలానికి చెందిన కొసన శ్రీశైలం, బూడిద కృష్ణ, ఎలగందుల స్వామి, గడ్డం వెంకట్, పల్లపు రాజు, భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన పల్లెపాటి లింగం, మోటకొండూరు మండలం నాంచారిపేటకు చెందిన గంగదారి నర్సింహను అదుపులోకి తీసుకున్నట్లు ఆత్మకూర్​ ఎస్సై ఎం.డి.ఇద్రీస్​ అలీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.61,210 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 8 చరవాణులు, 5 సెట్ల పేకలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి: ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.