సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారని ఓ విలేకరి కథనం రాశాడు. ఈ కథనంపై స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి... తనపై బెదిరింపులకు గురి చేయడంతో ఆయనపై ఆ విలేకరి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాడు.
ఈ కేసు నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి నోటీసులు అందజేశారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన మహిపాల్ రెడ్డికి భీమ్‌రెడ్డి నోటీసులు అందజేశారు. ఈ కేసు విషయంలో వివరణ కూడా కోరతామని తెలిపారు.