నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన చింతకుంట నర్సుబాయి వృద్ధురాలు సోమవారం మధ్యాహ్నం అంగడి చేయడానికై మార్కెట్‌కు వచ్చి ఓ దుకాణం వద్ద సంచి మర్చిపోయి వెళ్లింది. కాగా కొద్దిసేపటి గుర్తొచ్చి చూస్తే అక్కడ ఆ సంచి కనిపించలేదని దానిలో రెండు తులాల బంగారు గుండ్లు ఉన్నావని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్సై సాయినాథ్ ఘటనాస్థలానికి వెళ్లి దుకాణం వద్ద ఎంక్వయిరీ చేశారు. కాగా తన షాపులో ఓపెద్దమనిషి సంచి మర్చిపోయిందని ఆమెను ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయిందని.. తన వెనకాలే అదేరంగు చీరకట్టుకున్న మరో మహిళవస్తే తనదే అనుకుని ఆమెకు ఇస్తే తీసుకుని వెళ్లిందని దుకాణదారు తెలిపింది. ఆమె వివరాలు తనకు తెలియదు చెప్పింది. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు... ఆ మహిళ ఒక ఆటో ఎక్కిందని గమనించారు. ఆటో వాళ్లందరని విచారించగా.. చివరకు ఆమె మంచిప్ప గ్రామానికి చెందినదిగా గుర్తించి.. తన వద్ద నుంచి 2 తులాల బంగారు గుండ్లు స్వాధీనం చేసుకుని నార్సుబాయికి అప్పగించారు.
ఇదీ చూడండి: ఆ నేపాలీల కోసం 8 బృందాలతో గాలింపు