పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన 15 మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి.. ఉదయం వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి పూట చోరీలకు పాల్పడుతున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. గత 20 రోజులుగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి, 5 ఎల్ఈడీ టీవీలు, ఓ ల్యాప్‌టాప్‌తో పాటు రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 12 మందిని అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న మరో ముగ్గురినీ త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిబ్బందిని డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ రమేశ్, రెండో పట్టణ సీఐ రాజ్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.