ETV Bharat / jagte-raho

జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై కౌంటర్ దాఖలు - బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసు వార్తలు

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో నిందితుడిగా ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న అతనికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు.

police-file-a-counter-petition-on-jagat-vikyat-reddy-pre-bail-petition-in-secunderabad-court
జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై కౌంటర్ దాఖలు
author img

By

Published : Jan 25, 2021, 4:55 PM IST

Updated : Jan 25, 2021, 6:07 PM IST

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో నిందితుడిగా ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. భూవివాదానికి సంబంధించి ముగ్గురు సోదరులను అపహరించిన కేసులో బాధితులను విఖ్యాత్ రెడ్డి తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు.

ఈ కేసుతో విఖ్యాత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్​లో పేర్కొన్నారు. దర్యాప్తునకు విఖ్యాత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తారని న్యాయవాది పేర్కొన్నారు. వాదనను సికింద్రాబాద్ న్యాయస్థానం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : సభాపతి

Last Updated : Jan 25, 2021, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.