నారాయణ పేట్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కొత్త బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న గంగాధర్ అనే వ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడింది. మూసి ఉన్న ఇళ్లే ఇతని టార్గెట్ అని దర్యాప్తులో తేలింది.
గత నెల 28న జిల్లా కేంద్రంలోని ఓ ఇంటి తాళం పగలగొట్టి బంగారం, వెండి వస్తువులతో పాటు రూ.1,03,000 నగదు దొంగిలించాడు. డీఎస్పీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన సీఐ శ్రీకాంత్ రెడ్డి కేసును ఛేదించారు.
గంగాధర్ ఇప్పటికే 34 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుని నుంచి 6.6 తులాల బంగారం, 20 తులాల వెండి, తాళాలను పగల కొట్టడానికి ఉపయోగించిన రాడ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితున్ని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి