ETV Bharat / jagte-raho

భార్య కొట్టడం వల్లే మృతి చెందాడు! - wife killed his husband

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టైలర్​ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భార్య పదునైన ఆయుధంతో కొట్టడం వల్లే అతను మృతి చెందినట్లు పోలీసులు నిర్దరించారు. క్షణికావేశంలో భార్య ఆవేశానికి భర్త బలైనట్లు పోలీసులు తెలిపారు.

police chased murder case in medchal district
భార్య కొట్టడం వల్లే మృతి చెందాడు!
author img

By

Published : Oct 7, 2020, 12:07 AM IST

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్​ పరిధిలో ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో ఈనెల 1వ తేదీన తలకు, చేతికి గాయాలతో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. వైద్యులు నిర్వహించిన శవపరీక్షలో తీవ్రంగా గాయపరచడం వల్ల మృతి చెందినట్లు నిర్ధరణ అయిందని పోలీసులు తెలిపారు. గంగారం అంజయ్య(50) ఘట్‌కేసర్‌లోని ఓ దుకాణంలో టైలర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 1వ తేదీ ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు. ఓ వ్యక్తి నుంచి పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ వచ్చింది. ఘట్‌కేసర్‌ పోలీసు పెట్రోలింగ్‌ పోలీసులు అంజయ్య ఇంటికి వచ్చారు. అప్పటికే అంజయ్య తలకు, చేతికి గాయాలతో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. శవ పరీక్షలో తీవ్రంగా కొట్టడం వల్ల మృతి చెందినట్లు తేలింది. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో పలు కీలక వివరాలు రాబట్టారు.

కుటుంబ సభ్యులపై అనుమానంతో..

దర్యాప్తు చేపట్టిన సీఐ చంద్రబాబు మృతుడికి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరిపారు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవని తేలింది. అంజయ్యకు మద్యం తాగే అలవాటు ఉంది. నిత్యం తాగి వచ్చి భార్య, కొడుకుతో ఘర్షణకు దిగేవాడని పోలీసులు గుర్తించారు. మత్తులో భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేసేవాడు. వస్తువులను నష్టపరిచేవాడు. ఇలా చేస్తే పెళ్లి కావాల్సిన కొడుకుకు అమ్మాయిని ఎవరు ఇస్తారని పలుమార్లు భార్య భర్తతో చెప్పింది. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు ఎక్కువ అయ్యాయి.

ఆరోజు ఏం జరిగింది..

హత్య జరిగిన రోజు అంజయ్య ఉదయం ఘట్‌కేసర్‌లోని తాను పని చేసే దుకాణానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. మద్యం తాగి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య, కొడుకుతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆవేశంతో పదునైన ఆయుధంతో భార్య ముఖంపై కొట్టింది. మద్యం మత్తులో ఉండటం వల్ల ప్రాణాలు విడిచాడు. భయపడిపోయిన భార్య గాయం అయినట్లు పసుపు పొడి పోసి రక్తం బయటకు రాకుండా ప్రయత్నించారు. సమీపంలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడిని ఇంటికి తీసుకొచ్చింది. పరిశీలించిన ఆయన మృతి చెందాడని చెప్పారు. అనంతరం 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అంజయ్య మృతి చెందాడని ధ్రువీకరించారు. భార్య మాత్రం తన భర్తకు మద్యం అలవాటు ఉందని, గాయాలతో ఇంటికివచ్చాడని.. ఏమైందని అడిగితే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని చెప్పాడని, స్థానికులను, పోలీసులను నమ్మించారు. అక్కడ జరిగిన సంఘటనకు మృతుడి భార్య, కొడుకు చెప్పే మాటలకు తేడా ఉండడం వల్ల పోలీసులు పూర్తి స్థాయిలో విచారించారు. ఇప్పటికే భార్య, కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంజయ్య హత్య కేసు వివరాలను త్వరలోనే మీడియాకు వివరిస్తామని సీఐ చంద్రబాబు'ఈటీవీ భారత్‌"కు చెప్పారు.

ఇవీ చూడండి:అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.