సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామ శివారులో ఎమ్ఎన్ఆర్ ఆసుపత్రి కట్ట కింద... గుర్తుతెలియని మహిళ హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 17న మహిళ మృతదేహం లభించడంతో... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు... డీఎస్పీ బాలాజీ నేతృత్వంలో 10 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు.
సంగారెడ్డిలో నివాసం ఉండే మిర్యాల జ్యోతిని... వికారాబాద్ జిల్లా నాగసముద్రానికి చెందిన వడ్డే శీనయ్య అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి చంపినట్టు డీఎస్పీ బాలాజీ వెల్లడించారు. ఈ నెల 14న అత్యాచారం చేసి హతమార్చినట్టు నిందితుడు విచారణలో అంగీకరించనట్టు వివరించారు. జ్యుడీషియల్ రిమాండ్ కోసం నిందితుడిని కోర్టుకు పంపినట్టు తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఇదీ చూడండి: మొరం ట్రాక్టర్ల పట్టివేత.. జేసీబీ స్వాధీనం