తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో.. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ డబ్బుకు అమ్ముతూ.. డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు యువకులను టప్పాచబుత్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గురువారం తెల్లవారుజామున గుడిమల్కాపూర్ మార్కెట్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై మధు... ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా స్కూటీపై తిరగడం గమనించారు. అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి అమ్ముతున్న విషయం బయటపడింది.
వారిద్దరినీ స్టేషన్‌కు తరలించి... కేసు నమోదు చేసి వారి వద్దనున్న గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వికాస్ సింగ్, అభిషేక్ సింగ్‌గా కిలో గంజాయి రూ. 1,000కి కొని... రూ.4 వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి : హైదరాబాద్‌లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్