రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు.
కొదురుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఆదివారం రాత్రి ఎల్లమ్మ ఆలయం తాళాలు పగులగొట్టి... అమ్మవారికి ఆలంకరించిన ఆభరణాలు, హుండీలోని నగదును కాజేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నేర పరిశోధనకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆధారాలను విశ్లేషించారు.
వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన ఓ పాత నేరస్థుడే ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందం వరంగల్‌కు వెళ్లింది. నిందితుడు చరవాణి వినియోగించకపోవడం వల్ల.. కదలికలు తెలుసుకోవడం కష్టంగా మారింది. అతని సన్నిహితులపై నిఘా పెట్టి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇవీచూడండి: ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.. ఆభరణాలు మాయం