ETV Bharat / jagte-raho

లోన్​యాప్​ ద్వారా రుణాలిస్తున్న వ్యక్తి అరెస్ట్​ - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

మొబైల్ అప్లికేషన్లు రూపొందించి వాటి ద్వారా రుణాలు ఇస్తున్న ఓ వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​కు చెందిన వ్యక్తి 4 యాప్​లు రూపొందించి వాటి ద్వారా కొంత మందికి రుణాలు ఇచ్చినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.

police arrested a man who is give loan through the online in hyderabad
యాప్​ ద్వారా రుణాలిస్తున్న వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Dec 19, 2020, 6:46 PM IST

ఆన్​లైన్​ యాప్​ల ద్వారా రుణాలిస్తూ వేధిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. యాప్​ ద్వారా రుణాలు ఇస్తున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​కు చెందిన వ్యక్తి 4 యాప్​లు రూపొందించి వాటి ద్వారా కొంత మందికి రుణాలు ఇచ్చినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. రుణాలు తీసుకున్న వ్యక్తుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. రుణం తీసుకున్న వ్యక్తులు ఇచ్చే డబ్బులను అతని ఖాతాలో వేయించుకున్నట్లు కూడా సైబర్ క్రైం పోలీసులు ఆధారాలు సేకరించారు.

ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారో వివరాలు సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని కిస్మత్​పూర్​లో సునీల్ అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగి రుణ సంస్థల నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు బెంగళూర్​లోని పలు మొబైల్ అప్లికేషన్ల నిర్వాహకుల నుంచి దాదాపు 2 లక్షల దాకా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. బెంగళూర్, పుణె, ఒడిశా, దిల్లీలో రుణ సంస్థలున్నట్లు తేల్చారు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ తరహాలోనే అప్పులు ఇస్తున్నట్లు గుర్తించారు. అప్లికేషన్ల చిరునామాలను కనుక్కునే పనిలో ఉన్నారు. ఎక్కువ శాతం చైనీస్ యాప్​లే రుణాలు ఇస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్ లోన్ వేధింపులు.. బలవుతున్న యువత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.