ETV Bharat / jagte-raho

జోరుగా ఐపీఎల్​ బెట్టింగు... యువకుల అరెస్ట్​ - hyderabad latest news

హైదరాబాద్​లో ఐపీఎల్​ బెట్టింగులకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.34 వేల నగదు, 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతోనే నిందితులు బెట్టింగులు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

police arrested 3 young man in ipl betting case in hyderabad

author img

By

Published : Oct 17, 2020, 6:58 PM IST

సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఐపీఎల్​ బెట్టింగ్​లకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.34 వేల నగదు, 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. బౌద్ధనగర్, చిలకలగూడ ప్రాంతాలకు చెందిన సాయిప్రసాద్, జియోద్దిన్​, ఇస్మాయిల్ కలిసి క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ముంబై ఇండియన్స్, కలకత్తా నైట్​రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో నిందితులు బెట్టింగ్​కు పాల్పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతోనే బెట్టింగులు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్​లైన్​ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ... డబ్బులను సైతం ఆన్లైన్ ద్వారా మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండిః గుట్కా పాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.