సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం షిరిడి సాయి ఆటో సర్వీస్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఒక పంపును లీగల్ మెట్రాలజీ అధికారులు సీజ్ చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శిరిడి సాయి ఆటో సర్వీస్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో చిప్ సహాయంతో పెట్రోల్ తక్కువ వచ్చేలా అమర్చి నందుకు లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు జరిపారు.
బంక్‌లో ఈ చిప్ అమర్చిన పంపును తనిఖీ చేసి స్థానిక పోలీసుల సహాయంతో చిప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులను మోసం చేస్తున్నందుకు యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'