ETV Bharat / jagte-raho

ఉన్మాది ఘాతుకం.. మహిళపై పెట్రోలు పోసి నిప్పు - bheemalapuram petrol attack news

పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మహిళను హత్య చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లి పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘాతుకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధిత కుటంబ సభ్యులు సైతం గాయాలపాలయ్యారు.

petrol-attack-on-family-at-bheemalapuram-in-west-godavari-district in ap
ఉన్మాది ఘాతుకం..మహిళపై పెట్రోలు పోసి నిప్పు
author img

By

Published : Jan 5, 2021, 6:00 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని భీమలాపురం గ్రామంలో మహిళపై ఉన్మాది పెట్రోల్‌తో దాడి చేయడం కలకలం సృష్టించింది. ఆచంటకు చెందిన నెక్కంటి నరేశ్‌ భీమలాపురంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో మంగళవారం ఉదయం ఆ మహిళ ఇంటికెళ్లి ఆమె ముఖంపై పెట్రోల్‌పోసి హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ భర్త, తల్లి, సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు.

ఉన్మాది చేతులకు కూడా గాయాలు కావడంతో అతన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పరీక్ష తప్పుతాననే భయంతో నర్సింగ్​ విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.