ETV Bharat / jagte-raho

కరోనా సోకిందనే అనుమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య - పురుగుల మందు తాగి ఆత్మహత్య

కరోనా మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జాలిగామలో జరిగింది.

person suicide due to corona fear in siddipet district
కరోనా సోకిందనే అనుమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య
author img

By

Published : Sep 2, 2020, 8:23 AM IST

కరోనా వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తి మూడు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన 32 సంవత్సరాల ఓ వ్యక్తి తనకు కరోనా వ్యాధి వచ్చిందనే అనుమానంతో భయాందోళనకు గురయ్యాడు. మూడు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మృతదేహాన్ని స్వగ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, అతని కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా సోకిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను పలువురు అభినందించారు.

ఇవీ చూడండి: భార్యకు కరోనా.. గుండెపోటుతో భర్త మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.