హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్‌లో ఓ వ్యక్తి మృతి చెదాడు. సూపర్ మార్కెట్‌కు వెళ్లి వస్తానని చెప్పిన తండ్రి గంటన్నర అవుతున్నా రావట్లేదనే అనుమానంతో అపార్ట్మెంట్ సెల్లార్లో చూడగా.. విగతజీవిగా పడి ఉన్న అతన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ రెండవ అంతస్తు 2002 ఫ్లాట్ నివాసి బీ.రాజ్ కుమార్ హైకోర్టులో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. 15 రోజుల క్రితం ఆయన తల్లి మృతి చెందగా.. రాజ్ కుమార్ సెలవులో ఉన్నారు. గత రాత్రి వర్షం తగ్గిన తర్వాత సూపర్ మార్కెట్‌కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చాడు.
గంటన్నర అవుతున్నా తమ తండ్రి రావట్లేదని సూపర్ మార్కెట్‌కు, బంధువులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. అసలు మీ తండ్రి రాలేదని వారు చెప్పడంతో అనుమానంతో అపార్ట్మెంట్ సెల్లార్లో చూడగా.. విగతజీవిగా పడి ఉన్న అతన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది సెల్లార్ లోని నీటిని తొలగించారు. విగతజీవిగా ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.