ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలోని కావేరి రెస్టారెంట్లో ఉద్రిక్తత నెలకొంది. సప్లై చేసే వ్యక్తి జేబులో ఉన్న పర్సును తీయటానికి న్యాయవాది కోట రాజు ప్రయత్నించడం వల్ల వివాదం తలెత్తింది. దీంతో కోటరాజుకు సప్లయర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సప్లయర్‌పై కోటరాజుకు చెందిన మరికొంత మంది వ్యక్తులు దాడి చేశారు.
హోటల్ నిర్వాహకులు కూడా ప్రతిదాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెస్టారెంట్ నిర్వాహకులు, సప్లయర్‌పై... న్యాయవాది కోటరాజు నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: యువకుడిపై మూకదాడి.. 12 మందిపై కేసు