వేటగాళ్ల విష ప్రయోగానికి 8 నెమళ్లు బలైన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లోని ఆర్కే-5 సింగరేణి గని సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారించగా... విషం కలిపిన వడ్ల గింజలు తిన్నట్టు వెల్లడైంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు