ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన నిజామాబాద్‌లోని బర్కత్‌పుర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు డీఈవో కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. డీఈవోకు వినతి పత్రం అందజేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి బదిలీ లేకుండా 23 ఏళ్లుగా ఒకే పాఠశాలలో కొనసాగుతున్న ప్రధానోపాధ్యాయుడిపై అనేక ఆరోపణలు ఉన్నాయని పీడీఎస్‌యూ పేర్కొంది. విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రాలపైనా అనేక సందేహాలు ఉన్నాయని వ్యక్తం చేసింది. అతడిని సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నాటు సారా స్వాధీనం.. గంజాయి మొక్కలు ధ్వంసం