ETV Bharat / jagte-raho

కుమారుడి కోసం ఏడాదిన్నరగా పరితపిస్తున్న తల్లిదండ్రులు - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

కొడుకు ఒక్క క్షణం కనిపించకుండా పోతే తల్లి గుండె తల్లడిల్లుతుంది. కుమారుడు కళ్ల ముందు లేకుంటే తండ్రి మనసు చిన్నబోతుంది. నవమాసాలు మోసిన అమ్మ, వేలు పట్టి నడక నేర్పిన నాన్నకు ఓ కొడుకు దుఃఖాన్ని మిగిల్చాడు. ఏడాదిన్నర నుంచి కనిపించకుండా పోయాడు. ఆ తనయున్ని తలుచుకుంటూ నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు మియాపూర్​కు చెందిన తల్లిదండ్రులు..

parents wait for his son since one and half year in hyderabad
కుమారుడి కోసం ఏడాదిన్నరగా పరితపిస్తున్న తల్లిదండ్రులు
author img

By

Published : Dec 17, 2020, 9:55 PM IST

హైదరాబాద్​ మియాపూర్​కు చెందిన నరసింహా రావు, ఉమా నాగలక్ష్మి దంపతులకు కుమారుడు బ్రహ్మానందం(22) ఉన్నారు. అతను గీతం విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్‌లో విప్రో కంపెనీలో ఉద్యోగం పొందాడు. రెండు నెలలు ఉద్యోగం చేసిన బ్రహ్మానందం.. గత ఏడాది జులై 3న విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై విప్రో కార్యాలయంలో సంప్రదించగా.. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సీసీ పుటేజీ ద్వారా తేల్చారు.

భయాందోళనకు గురైన నరసింహ రావు దంపతులు అదే రోజు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినా... ఇప్పటివరకు యువకుడి ఆచూకీ లభించలేదు. తమ ఒక్కగానొక్క కుమారుడు కనిపించకుండా పోవటంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అశలన్నీ కుమారుడిపైనే పెట్టుకున్నామని... అతను లేని జీవితం మాకు ఎందుకు అంటూ విలపిస్తున్నారు ఆ దంపతులు.

కుమారుడి కోసం ఏడాదిన్నరగా పరితపిస్తున్న తల్లిదండ్రులు

ఇదీ చదవండి: ఆధార్​ వివరాలు అడగొద్దు... స్లాట్​ బుకింగ్​ నిలిపేయండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.