జనగామ జిల్లా పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్యాల... హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. వర్ధన్నపేట నియోజవర్గంలోని నల్లబెల్లి ఆయన స్వస్థలం.
2004లో తెరాస అభ్యర్థిగా గెలిచి... అప్పటి సీఎం వైస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009, 2014లో ఎర్రబెల్లి దయాకరరావు చేతిలో పరాజయంపాలయ్యారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
దుగ్యాల శ్రీనివాసరావు మృతిపట్ల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతీ రాఠోడ్, ఎర్రబెల్లి దయాకరరావు సంతాపం తెలిపారు. పాలకుర్తి అభివృద్ధిలో దుగ్యాల శ్రీనివాసరావు ముఖ్యపాత్ర పోషించారని ఎర్రబెల్లి కొనియాడారు. మంచి సన్నిహితుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: పోలీసుల కస్టడీలో అఖిలప్రియ.. బేగంపేట మహిళా ఠాణాకు తరలింపు