ETV Bharat / jagte-raho

ఆ లింక్‌ను క్లిక్ చేస్తే... మీ సమాచారమంతా వారికే!

కొత్తరకం సైబర్‌ నేరానికి పాకిస్తాన్ సైబర్‌ నేరగాళ్లు తెరలేపారు. నకిలీ ఆరోగ్యసేతు యాప్​ పేరుతో ఫోన్​కు లింకులు పంపున్నారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చౌర్యం చేసేందుకు యత్నిస్తున్నట్లు నిఘావర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి.

pakistan-agencies-created-fake-aarogya-setu-app-indian-army-officials-warn-military-personnel
ఆ లింక్‌ను క్లిక్ చేస్తే... మీ సమాచారమంతా వారికే!
author img

By

Published : Jun 8, 2020, 4:01 PM IST

నకిలీ ఆరోగ్యసేతు యాప్ పేరుతో లింక్‌లు పంపిస్తూ పాకిస్తాన్ సైబర్‌ నేరగాళ్లు మరో కొత్తరకం చౌర్యానికి పాల్పడుతున్నారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చౌర్యం చేసేందుకు యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి.

ప్రధానంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మొబైల్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే... చాట్‌ మీ అనే యాప్‌ డౌన్ లోడ్‌ అవుతుందని దీని ద్వారా ఫోన్‌లో ఉన్న సమాచారమంతా వారి సర్వర్‌లలో నిక్షిప్తమవుతుందని నిఘా వర్గాలు తెలిపాయి.

దీనిపై అప్రమత్తమైన తెలంగాణ మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేందర్ రెడ్డి ఉద్యోగులకు ఇలాంటి లింక్‌లు క్లిక్ చేయవద్దని సూచించారు. ఎటువంటి అనుమానం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ఇదీ చదవండి: సీఎంకు గొంతునొప్పి- మంగళవారం కరోనా టెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.