ETV Bharat / jagte-raho

ఐటీ కట్టకుండానే వందల కోట్లు దేశం దాటించారు..

author img

By

Published : Aug 27, 2020, 6:34 PM IST

ఆన్​లైన్​ జూదం నిర్వహించి కోట్లు కాజేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆన్​లైన్​లో జూదం ద్వారా డోకిపే, క్లిక్ టుపే, స్పాట్​పే, లింక్ యున్ సంస్థల ఖాతాల్లో వచ్చి పడిన కోట్ల రూపాయల సొమ్మును హాంకాంగ్ తరలించినట్టు సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నారు.

ఆన్​లైన్​ జూదం పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు

ఈ కామర్స్​ ముసుగులో ఆన్​లైన్​ జూదం నిర్వహించి కోట్ల రూపాయలు కాజేసిన నలుగురి నిందుతులను పోలీసులు విచారిస్తున్నారు. హాంకాంగ్ నుంచి చైనాలోని కంపెనీకి చెందిన టీ పవర్ ఖాతాలోకి నగదు బదిలీ అయినట్లు కూడా గుర్తించారు. ప్రధాన నిందితుడు చైనాకు చెందిన యాన్​హువోతో పాటు... సహ నిందితులు ధీరజ్, నీరజ్, అంకిత్​లను సీసీఎస్​ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

సుమారు 30 ఈ కామర్స్ సంస్థలు స్థాపించి ఆ ముసుగులో ఆన్​లైన్​ జూదం నిర్వహించారు. టెలిగ్రామ్ అప్లికేషన్​ ద్వారా యువతను ఆకర్షించి పదకొండు వందల కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు. ఈ కేసు సంబంధించి పరారీలో ఉన్న దిల్లీకి చెందిన వ్యక్తులతో పాటు చైనాకు చెందిన వారిని అరెస్టు చేస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తునారు. డోకీ పే, లింక్ యున్ సంస్థలకు చెందిన ఖాతాల్లో జమ అయిన వందల కోట్ల రూపాయలకు కనీసం పన్ను కూడా కట్టలేదని అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.