లోన్ ఇప్పిస్తామంటూ... బజాజ్ అలియాన్జ్ ఫైనాన్స్ కంపనీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ హైదరాబాద్ నల్లకుంటకు చెందిన వెంకట సాయికి ఫోన్ వచ్చింది. నమ్మిన సాయి... వాళ్లు పంపిచమన్న డాక్యుమెంట్లు మెయిల్ చేశాడు. ప్రోసెసింగ్ ఫీజ్, డాక్యుమెంట్ల చార్జ్ కింద లక్షా 75 వేల రూపాలయలు ఇవ్వాలని చెప్పారు. వెంటనే వారు తెలిపిన ఖాతాకు నగదు బదిలీ చేశాడు. రోజులు గడిచినా లోన్ మంజూరు కాకపోవడం, ఫోన్ స్విచ్ఛాప్ రావడం వల్ల మోసపోయానని గ్రహించిన సాయి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో కేసులో మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేయాలంటూ... రీన్ బజార్‌కు చెందిన సలాముద్దీన్కు సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. మాటలకు ఆకర్షితుడైన అతను వారు చెప్పిన ఓ యాప్‌ను తన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. కార్డు వివరాలు, పిన్ నంబర్‌ను అందులో నమోదు చేయగానే లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు సైబర్ నేరగాడు. ఖంగుతిన్న సలాముద్దీన్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా జనాలు ఇలాంటి చోరీలకు గురవుతూనే ఉన్నారు. మోసగాళ్లను నమ్మొద్దని... అమాయకంగా వారి చేతిలో మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని ఉందా...!