ETV Bharat / jagte-raho

'ఆన్​లైన్​లో చేతబడి నేర్చుకుని అలా చేశారు... చివరకు ఇలా దొరికారు' - ఆన్​లైన్​లో చేతబడి తాజా వార్తలు

ఆన్​లైన్​లో క్లాసులు నేర్చుకోవడం చూశాం.. కానీ ఇక్కడ కొందరు యువకులు ఆన్​లైన్​లో చేతబడి నేర్చుకుంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ కింది కథనంపై ఓసారి లూక్కేయండి.

online black magic at   Huzur Nagar  In Suryapeta district
'ఆన్​లైన్​లో చేతబడి నేర్చుకుని మరీ చేశారు... చివరకు ఇలా దొరికారు'
author img

By

Published : Oct 2, 2020, 4:57 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో నలుగురు యువకులు చేతబడి నేర్చుకుంటూ.. సంచలనం సృష్టించారు. గోవిందాపురంలో స్థానికంగా ఉండే నలుగురు యువకులు... అర్ధరాత్రి స్మశాన వాటికలో చేతబడి చేస్తున్నారు. అదే సమయంలో అటు వైపునకు వెళ్లే మనుషులకు స్మశాన వాటిక నుంచి ఏవో మనుషుల అరుపులు వినిపించాయి. అనుమానం వచ్చి అటువైపు వెళ్లగా నలుగురు యువకులు అక్కడ కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ కనిపించారు.

వెంటనే సదరు వ్యక్తి భయాందోళనకు లోనై... స్థానికులకు ఫోన్​లో సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు చేతబడి చేస్తున్న యువకులను పట్టుకొని నిలదీశారు. ఇంట్లో సమస్యలు తొలిగి పోవటానికి ఇలా చేస్తున్నామని చెప్పారు... కానీ వీళ్లు చెప్పిన విషయాలు నమ్మదగిన విధంగా అనిపించక పెద్ద మనుషులతో కలిసి చేతబడి చేసిన ప్రదేశానికి వెళ్లగా విస్తుబోయే విషయాలు బయట పడ్డాయి.

ఆ నలుగురు యువకుల్లో ఇట్టి రాము అనే వ్యక్తి అత్తగారి ఫోటో... ఒక అమ్మాయి ఫోటో.. రెండు కోళ్లు, పసుపు ముద్దలు.. పెట్టి కనిపించాయి. ఎవరో ఫోన్​లో మంత్రాలు చదివితే వీళ్లు కూడా ఆ ఫోటోలపై పసుపు వేస్తూ రెండు కోళ్లను బలిచ్చామని ఒప్పుకున్నారు.

ఇదీ చూడండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.