కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారంలో యామ తిరుపతి అనే వ్యక్తి మంగళవారం ఉదయం బహిర్భూమికి బయటకు వెళ్లగా.. రెండు ఎలుగు బంట్లు ఒకేసారి దాడికి దిగాయి. బాధితుడు తప్పించుకుని పరిగెత్తి ప్రాణాలు రక్షించుకున్నాడు.
రెండు ఎలుగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుపతిని బంధువులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటనతో స్థానిక ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి.
- ఇదీ చూడండి ఆ రెండు ప్రతిపాదనలకు నో.. 12న మళ్లీ సమావేశం